లాక్ డౌన్ వలన దాదాపు ఆరున్నర నెలల పాటు థియేటర్స్ పడడంతో సినీ రంగంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి తెలిసిందే. ఎన్నో మిడ్ రేంజ్ బడ్జెట్ సినిమాలు అన్నీ కూడా నేరుగా ఓటిటిలోనే విడుదలకు నొక్కుకున్నాయి. అలా వచ్చిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “నిశ్శబ్దం”. అనుష్క మెయిన్ లీడ్ లో నటించిన ఈ చిత్రం ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లోకి నేరుగా విడుదలయింది.
భారీ అంచనాలు పెట్టుకున్న ఈ చిత్రం ఒకింత మూవీ లవర్స్ కు నిరాశనే మిగిల్చింది అని చెప్పాలి. అయితే ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఈ ప్రాజెక్ట్ ఎలా మొదలయ్యిందో నుంచి చాలానే విషయాలను వెల్లడించారు. ఇదిలా ఉండగా మరో ఆసక్తికర విషయాన్ని కూడా ఈ దర్శకుడు వెల్లడించినట్టు తెలుస్తుంది.ఈ దర్శకుడు ఈ చిత్రాన్ని మొదలు పెట్టిన తర్వాత సీక్వెల్ ను కూడా ప్లాన్ చేశారట. కానీ ఇప్పుడు సినిమా ఫలితం వేరేలా వచ్చింది. మరి దర్శకుడు ఏం చేస్తారో చూడాలి.