త్వరలో ప్రారంభంకానున్న నిఖిల్ కొత్త సినిమా

త్వరలో ప్రారంభంకానున్న నిఖిల్ కొత్త సినిమా

Published on Mar 12, 2014 2:36 AM IST

nikhil-siddharth
నిఖిల్ ని వెండితెరపై చూసి దాదాపు సంవత్సరం కావస్తుంది. కానీ స్వామి రారా విజయంతో అతనికి డోకా లేకుండా పోయింది. నిఖిల్ ని కొత్త దర్శకులు తాజా కధలతో సంప్రదిస్తున్నారని సమాచారం

‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘కార్తికేయ’ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా మారి నిఖిల్ తో సినిమా చేయనున్నాడు. సురక్ష గ్రూప్ కంపనీస్ బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ సినిమాను నిర్మించనున్నాడు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుపనున్నారు

కొన్ని రోజుల క్రితం నిఖిల్ కార్తికేయ చిత్రానికి షూటింగ్ ముగించుకుని చిత్ర బృందం నిర్మాణాంతర కార్యక్రమాలలో నిమగ్నమై వున్నారు. అకారణ మరణాల గురించి తెలుసుకునే నేపధ్యంలో ఒక ఊరికి వచ్చిన పాత్రలో హీరో కనిపించనున్నాడు. స్వాతి హీరోయిన్. శేఖర్ చంద్ర సంగీత దర్శకుడు

తాజా వార్తలు