‘హ్యాపీడేస్’ సినిమాతో విజయాల రుచిని చవిచూసిన నిఖిల్ ప్రస్తుతం ‘స్వామిరారా’ అందించిన మరో విజయపు జోరుతో ‘కార్తికేయ’ సినిమాలో మరోసారి స్వాతితో జతకట్టనున్నాడు నిన్న ట్విట్టర్ లో తన అకౌంట్ లో ఆరోగ్యానికి సంబంధించిన ప్రశ్నలను అడగమని నిఖిల్ డైటీషియన్ అవతారం ఎత్తి అందరినీ ఆశ్చర్యపరిచాడు. నిజానికి ఫిట్ నెస్ పై చాలా అవగాహన వుందని, అతని అభిమానులకి ట్విట్టర్ ద్వారా కొన్ని సలహాలను ఇచ్చాడు. రీబాక్ సంస్థ ద్వారా ఆటను ఫిట్ నెస్ ట్రైనర్ గా 2006 లో సర్టిఫికేట్ ఇచ్చిందని తెలిపాడు. తన తదుపరి సినిమాకు మంచి బాడీ తో అలరిస్తదేమో చూద్దాం.