నిఖిల్, స్వాతి ల కార్తికేయ సినిమా షూటింగ్ చివరిదశలో వుంది. ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ నేడు మొదలైంది. ప్యాచ్ వర్కులతొ సహా ఈ సినిమా షూటింగ్ ను త్వరలో ముగించానున్నారు. చందూ మొందేటి దర్శకుడిగా పరిచయంకానున్నాడు. మాగ్నమ్ సినిమా ప్రైమ్ బ్యానర్ పై వెంకట్ శ్రీనివాస్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
దేవాలయం నేపధ్యంలో వరుస మరణాల మిస్టరీ ని చేదించడానికి నిఖిల్ ఒక గ్రామానికి వెళ్తాడు. ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషలలో విడుదలకానుంది
నిఖిల్ సిద్ధార్ధ, స్వాతీ తమ గత చిత్రం ‘స్వామి రారా’ విజయంతో చాలా ఆనందంగా వున్నారు. మరోసారి ఆ మ్యాజిక్ ను తెరపై ప్రదర్శించాలని కోరుకుందాం.