కరోనా చైనా కుట్రే అంటున్న యంగ్ హీరో… ప్రూఫ్ గా..?

కరోనా చైనా కుట్రే అంటున్న యంగ్ హీరో… ప్రూఫ్ గా..?

Published on Apr 16, 2020 10:44 AM IST

యంగ్ హీరో నిఖిల్ ప్రాణాంతక కరోనా వైరస్ చైనా కుట్రలో భాగమే అంటున్నారు. దానికి రుజువుగా ఆయన కొన్ని అనుమానాలను లేవనెత్తుతున్నాడు. చైనాలోని వుహాన్ నగరంలో ఈ వైరస్ మొదటిసారి విజృభించగా చైనా జనవరి నుండి వుహాన్ నగరం నుండి చైనాలోని ఇతర ప్రాంతాలకు రవాణా నిలిపివేసింది. కానీ వుహాన్ నగరం నుండి ప్రపంచ దేశాలకు ఫ్లైట్స్ మాత్రం నడిపింది. చైనా ఇలా ఎందుకు చేసింది అని నిఖిల్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

చైనా లోని వుహాన్ నగరంలోని ఓ ల్యాబ్ లో కరోనా వైరస్ రూపొందింది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో నిఖిల్ ఇలా ట్విట్టర్ వేదికగా స్పందించారు. చైనా ఉద్దేశ పూర్వకంగా ఈ ప్రాణాంతక వైరస్ ని ప్రపంచం పైకి వదిలింది అని ఆరోపించారు. ఇక నిఖిల్ పెళ్లి కరోనా వైరస్ కారణంగా ఆగిపోయింది. ఆయన తన ప్రేయసి డాక్టర్ పల్లవిని ఈ నెలలో వివాహం చేసుకోవాల్సి వుంది. నిఖిల్ ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 మూవీలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు