నాలుగు భాషల్లో నికిష పటేల్ బిజీ

నాలుగు భాషల్లో నికిష పటేల్ బిజీ

Published on Apr 6, 2013 6:42 PM IST

Nikesha-Patel

నికిష పటేల్ ప్రస్తుతం దక్షిణ భారత దేశాలోని నాలుగు భాషలలో నటిస్తూ బిజీగా వుంది. ఇప్పటి వరకు తను తెలుగులో 2010లో విడుదలైన ‘పులి’ సినిమలో మాత్రమే నటించింది. తరువాత కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ‘ఓం’ సినిమాకి సైన్ చేసింది. కాని ఈ సినిమాకి రెండు సంవత్సరాలుగా ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా ఈ సంవత్సరం విదుదలైయ్యె అవకాశం వుంది. ఏది ఏమైనా ఈ సంవత్సరం ఆమె కేరేర్ చాలా బాగుంది. ఇందులోనే కాకుండా ఎంఎస్ రాజు సినిమా రామ్ (రంభ, ఊర్వసి, మేనక) కూడా నటిస్తోంది. ఈమద్యే కనడలో విడుదలైన ‘వరదానాయకా’ సినిమా హిట్ ను సాదించడంతో ఆమెకు కనడలో చాలా ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం తను మరో తమిళ సినిమాలో నటించడానికి ఒప్పుకుంది.

‘ నేను మూడవ తమిళం సినిమాకి సైన్ చేశాను. నా మొదటి తమిళ సినిమా విడుదలకాలేదు’. అని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. గత సంవత్సరం ఆమె తమిళంలో శంతను భాగ్యరాజ్ తో కలిసి టైటిల్ పెట్టని సినిమాలో నటిస్తుందని అన్నారు. ప్రస్తుతం నికిష పటేల్ రమేష్ సెల్వం దర్శకత్వం వహిస్తున్న సినిమాని ఒప్పుకుంది. ఈ సినిమాకు సంబందించిన వివరాలను త్వరలో తెలియజేస్తాం. ప్రస్తుతం నికిష పటేల్ తన కో స్టార్స్, ఫ్రెండ్స్ త్రిష, చార్మీ తో కలసి మస్సుట్ లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది.

తాజా వార్తలు