రాత్రిళ్ళు కష్ట పడుతున్న ఎన్.టి.ఆర్

రాత్రిళ్ళు కష్ట పడుతున్న ఎన్.టి.ఆర్

Published on Jul 5, 2013 5:26 AM IST

Ramayya-Vasthavayya
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. నిన్న ఈ సినిమాని చిరన్ ఫోర్ట్ లో షూట్ చేసారు. అక్కడ ఈ చిత్రంలోని ప్రధాన తారాగణంపై కొన్ని నైట్ ఎఫెక్ట్ సీన్స్ ని షూట్ చేసారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ కోసం చాలా పవర్ఫుల్ పాత్రని రూపొందించాడని సమాచారం. ‘సెప్టెంబర్ లో ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్న ఈ మూవీకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత దిల్ రాజు ఎన్.టి.ఆర్ తో వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న సినిమాని కూడా నిర్మించనున్నాడు.

తాజా వార్తలు