‘ది రాజా సాబ్’ పై నిధి అగర్వాల్ క్లారిటీ !

కమర్షియల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా ‘ది రాజా సాబ్’ అనే భారీ పాన్ ఇండియా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, నిధి అగర్వాల్‌, ప్రభాస్‌ సరసన ఈ భారీ ప్రాజెక్ట్‌ లో నటిస్తోంది. అయితే, తాజాగా ఆమె ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘రాజాసాబ్‌’లో తన పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘‘హారర్‌ కామెడీ నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో నేను దెయ్యం పాత్ర పోషించడం లేదు. పూర్తి వినోదాత్మకంగా సాగే ఈ సినిమాలో నా పాత్ర కచ్చితంగా అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటుంది. ప్రభాస్ ఎప్పుడూ నవ్విస్తూ ఉంటారు. సెట్‌లో అందరితో సరదాగా ఉంటారు’’ అని నిధి అగర్వాల్ తెలిపింది.

ఇక ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నట్టు ఈ సినిమా ఎడిటింగ్ టేబుల్‌పై ఇప్పటికే మూడున్నర గంటల సినిమా నిడివి ఉందని, ప్రస్తుతం ఎడిటింగ్ విభాగం ఆ నిడివి తగ్గించే పనిలో ఉందని తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా పై పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు ఉన్నాయి.

Exit mobile version