‘హరిహర వీరమల్లు 2’ పై నిధి అగర్వాల్ లీక్స్!

‘హరిహర వీరమల్లు 2’ పై నిధి అగర్వాల్ లీక్స్!

Published on Jul 15, 2025 11:59 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకులు క్రిష్, జ్యోతి కృష్ణలు తెరకెక్కించిన భారీ చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా దీనికి పార్ట్ 2 కూడా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. పార్ట్ 1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ గా వస్తుండగా పార్ట్ 2 ని మరో టైటిల్ తో ప్లాన్ చేస్తున్నారు.

అయితే నిధి అగర్వాల్ లేటెస్ట్ గా పార్ట్ 2 పై ఇచ్చిన లీక్స్ వైరల్ గా మారాయి. పార్ట్ 1 ఆల్రెడీ కంప్లీట్ అయ్యి రిలీజ్ కి వస్తుంది కానీ పార్ట్ 2 కి సంబంధించి తాము ఆల్రెడీ 20 శాతం షూటింగ్ ని చేసేసినట్టుగా ఆమె చెప్పుకొచ్చింది. అలాగే పార్ట్ 2 మిగతా షూటింగ్ కూడా త్వరలోనే మొదలవుతుంది అని కూడా తెలిపింది. దీనితో ఈ బ్యూటీ కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. ఇక ఈ అవైటెడ్ సినిమా రానున్న జూలై 24న పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు