టాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంది. రీసెంట్‌గా ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’లో నటించింది. ఇక ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రం ప్రభాస్ సరసన ‘ది రాజాసాబ్’ను రిలీజ్‌కు రెడీ చేస్తోంది. అయితే, తాజాగా ఓ విషయంపై సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ పేరు జోరుగా వినిపిస్తోంది.
ఇటీవల ఏపీలోని భీమవరంలో ఓ స్టోర్ ఓపెనింగ్‌కు నిధి అగర్వాల్ గెస్ట్‌గా వెళ్లింది. అయితే, ఆ ఈవెంట్ ఆర్గనైజర్లు నిధి అగర్వాల్‌ను ఓ వాహనంలో తమ స్టోర్‌కు తీసుకొచ్చారు. అది ప్రభుత్వ వాహనం అని.. ఓ హీరోయిన్ ప్రభుత్వ వాహనంలో ఇలాంటి ప్రైవేట్ ఈవెంట్లకు ఎలా వెళ్తుందని నిధి అగర్వాల్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
దీనిపై తాజాగా నిధి అగర్వాల్ స్పందించింది. ఆ ఈవెంట్‌కు వెళ్లేందుకు తాను వాడిన వాహనంతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఆ ఈవెంట్ ఆర్గనైజర్లు తనను అందులో తీసుకొచ్చారని.. అది ప్రభుత్వ వాహనం అని తనకు తెలియదని.. దీనికి ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదని ఆమె పేర్కొంది. ఈ విషయంలో ఏ ప్రభుత్వ అధికారుల జోక్యం లేదని ఆమె స్పష్టం చేసింది. తన అభిమానులకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందని.. అందుకే ఇలా పూర్తి వివరణ ఇచ్చినట్లు ఆమె తన లేఖలో పేర్కొంది.