చాలా కాలం తర్వాత స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఒక స్ట్రైట్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అదే “హరిహర వీరమల్లు”. అయితే ఈ సినిమా ఎప్పుడో రావాల్సింది కానీ అలా ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ ఆలస్యానికి ఉన్న అనేక కారణాల్లో పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీ అయ్యిపోయి డేట్స్ ఇవ్వకపోవడం వల్లే అనే మరో కారణం కూడా వినిపించింది.
కానీ దీనిపై హీరోయిన్ నిధి అగర్వాల్ మాత్రం పవన్ ని వెనకేసుకొస్తుంది. వీరమల్లు ఆలస్యానికి పవన్ కారణం కాదని చెబుతుంది. తాను పాలిటిక్స్ లో ఉండడం వల్లే హరిహర వీరమల్లు ఆలస్యం అవ్వలేదు అని ఆమె చెబుతుంది. దీనితో తమ అభిమాన హీరో విషయంలో ఇంతలా ఆమె డిఫెండ్ చేయడంపై పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే నిధి అగర్వాల్క్ వీరమల్లు ప్రమోషన్స్ ని గట్టిగా చేస్తుంది. ఇక ఈ అవైటెడ్ సినిమా ఈ జూలై 24న విడుదల కాబోతుంది.