వేణు మాధవ్ మౌలాలి మెగాస్టార్ అట.!

వేణు మాధవ్ మౌలాలి మెగాస్టార్ అట.!

Published on Oct 13, 2013 8:30 PM IST

venu-madhav
వేణు మాధవ్ – చూడటానికి చాలా పొట్టిగా కనిపించిన తన కామెడీతో నటించడంలో మాత్రం బాగా సక్సెస్ అయ్యాడు. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్న వేణుమాధవ్ ఈ మధ్య తక్కువ సినిమాల్లో కనిపిస్తున్నాడు.

మీ ఓవరాక్షన్ వాళ్ళ మీకు అవకాశాలు తగ్గాయని చాలా మంది అనుకుంటున్నారు అని ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అడిగితే వేణు మాధవ్ సమాధానమిస్తూ ‘ఒకప్పుడు నేను వరుసగా సినిమాలు చేస్తూ తినడానికి, పడుకోవడానికి టైం లేక కార్లోనే తినేవాన్ని, కార్లోనే కునుకు తీసేవాన్ని. అలాంటప్పుడు ఎవరన్నా పలకరించినప్పుడు కాస్త బడలిక వల్ల సరిగా మాట్లాడకపోతే దాన్ని వల్ల బలుపు అనుకుంటే నేనేమి చేయగలను. ప్రస్తుతం తక్కువగా సినిమాలు చేస్తున్నది ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమాల వల్ల’ అని అన్నారు.

అలాగే మీకు ఆ రేంజ్ ఉన్నప్పటికీ సినిమా వాళ్ళకి దగ్గరగా కాకుండా దూరంగా ఎందుకు మౌలాలిలో ఉన్నారు అని అడిగితే వేణు మాధవ్ సమాధానం ఇస్తూ ‘ నాకు పది ఇల్లులున్నాయి. అవన్నీ మౌలాలిలోనే ఉన్నాయి. అలాగే మా అన్నయ్య, అక్కలు, చెల్లెలు ఇదే ఏరియాలో ఉంటారు. అలాగే ఈ ఏరియాలో అందరూ నన్ను వేణన్నా అంటారు. అదే నేను జూబ్లీ హిల్స్ లో ఉంటె నా ఇల్లు ఎవరికీ తెలిసేది కాదు. చెప్పాలంటే జూబ్లీ హిల్స్ లో చిరంజీవి మెగాస్టార్ అయితే నేను మౌలాలి మెగాస్టార్’ అని అన్నాడు.

తాజా వార్తలు