రొటీన్ చిత్రాలకు కాస్త భిన్నంగా చిత్రాలను తీసే విలక్షణ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో ప్రస్తుతం ఓ ద్విభాషా చిత్రం తెరకెక్కుతోంది. తమిళ్లో ‘ఇరందం ఉలగం’ పేరుతో రిలీజ్ చేస్తున్న ఈ సినిమాకి తెలుగులో వర్ణ అనే టైటిల్ ని పెట్టారు. తమిళ్ హీరో ఆర్య, హాట్ బ్యూటీ అనుష్క జంటగా నటిస్తున్న ఈ సినిమా హాలీవుడ్ మూవీ అవతార్ లానే ఉంటుందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలకు స్పందించిన సెల్వరాఘవ అవన్నీ నిజం కాదని కొట్టి పారేయడమే కాకుండా ఇప్పటికే తీసి హిట్ కొట్టిన అవతార్ లాంటి సినిమా నేనెందుకు చేస్తానని ఎదురు ప్రశ్న వేశారు.
ఆ సినిమా గురించి చెబుతూ ‘ నేను ఇప్పటివరకు ఇంత ఎంటర్టైనింగ్ గా ఉండే ఉండే సినిమా చేయలేదు. ఈ సినిమా సేకదాఫ్ లో హీరో హీరోయిన్ మరో కొత్త ప్రపంచానికి వెళతారు. ఆ అద్భుతమైన సన్నివేశాలను జార్జియాలో తీసాము. ఈ సినిమా రొటీన్ లవ్ స్టొరీ లకు చాలా భిన్నంగా ఉంటుందని’ అన్నారు. హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో ని జూలై లో సినిమాని ఆగష్టు లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.