టాప్ లేచిపోద్ది అంటున్న మరో మెగా హీరో

టాప్ లేచిపోద్ది అంటున్న మరో మెగా హీరో

Published on May 21, 2013 6:30 PM IST

Ram-Charan-and-Koratala-Shi
ఇప్పటికే పూరి జగన్నాధ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘ఇద్దరమ్మాయిలతొ’ సినిమాలో దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన టాప్ లేచిపోద్ది అన్న పాట మాస్ ను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు అదే టైటిల్ తో మరో మెగా హీరో సినిమా రూపుదిద్దుకుంటుందని సమాచారం. ఫిలింనగర్ వర్గాల ప్రకారం ‘మిర్చి’తో హిట్ కొట్టిన కొరటాల శివ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తాడన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు ‘టాప్ లేచిపోద్ది’ అనే టైటిల్ ను అనుకుంటున్నారు. నిర్మాత బండ్ల గణేష్ ఫిలిం ఛాంబర్ లో ఈ టైటిల్ ను నమోదు చేయించాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 28నుండి మొదలుకానుంది.

తాజా వార్తలు