పాతిక వసంతాల బంగారు చిత్రం

పాతిక వసంతాల బంగారు చిత్రం

Published on Jul 15, 2013 5:00 PM IST

Swarna-Kamalam
‘అందెల రవళిది పదమునదా.. అంబరమంటిన హృదయముదా..’ అన్న ప్రశ్నకు భానుప్రియ, వెంకటేష్ ఎలా సమాధానం చెప్పలేకపోయారో. ‘స్వర్ణ కమలం’ సినిమా ఇంతంటి భారీ స్థాయి విజయం సాదించడానికి కారణం కుడా అంత త్వరగా ద్రువీకరించాలేము. ఎందుకంటే అది సమిష్టి కృషి, సమస్త బృందం యొక్క కసి వల్ల అందిన విజయం. కళాతపస్వి కే. విశ్వనాధ్ దర్శకత్వంలో వెంకటేష్ చిత్రకారుడిగా, భానుప్రియ ‘అర్ధం చేసుకోరు’ అంటూ నాట్య మయూరిగా నటించారు. కాదు కాదు జీవించారు. అందుకే ‘స్వర్ణకమలం’ సినిమా వచ్చి నేటితో పాతికేళ్ళు అయినా ఎవ్వరూ ఇంకా ఆ సినిమాను మర్చిపోలేకపోతున్నారు.

ఇళయరాజా సంగీతానికీ,సిరివెన్నెల సాహిత్యానికీ మధ్య గట్టి పోటీ ఎదురవ్వడంతో ఈ సినిమాలో అద్బుతమైన పాటలు పండాయి. కమర్షియల్ సినిమాల విజయాలకు తక్కువ కాకుండా నిలబెట్టిన వాటిల్లో సాక్షి రంగారావు,శ్రీ లక్ష్మిల కామెడీ ట్రాకు ఒకటి. ఎన్నో రసరమ్య సన్నివేశాల మేళవింపు ‘స్వర్ణకమలం’. అటువంటి కమలం మన తెలుగు కోవెలలో ఎప్పటికీ పదిలంగా వుండాలని కోరుకుంటూ ఆ చిత్ర బృందానికి 123తెలుగు ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు