వేడుకకే ప్రధానాకర్షణ కానున్న రజని, కమల్ ఆట పాట

వేడుకకే ప్రధానాకర్షణ కానున్న రజని, కమల్ ఆట పాట

Published on Jul 17, 2013 6:00 PM IST

Rajnikanth-and-Kamal
దిగ్గజాలు దగ్గరగా కలిసివుంటేనే మనకు చూడడానికి రెండు కళ్ళూ సరిపోవు. మరి అటువంటిది సినీ తారాగణంలో మేటి నటులంతా ఒకే చోట కలిస్తే?? ఆ అనుభవమే వర్ణనాతీతం కదా. అటువంటి సంఘటన త్వరలో మనకు తారసపడనుంది. భారతీయ సినిమా 100ఏళ్ళు పూర్తిచేసుకున్న నేపధ్యంలో దక్షణాదిన సెప్టెంబర్ 1 నుండి 3 వరకు చెన్నైలో వేడుకలు జరుగనున్న విషయం తెలిసినదే.

ఈ వేడుకలో భాగంగా స్వర దిగ్గజాలు ఇళయరాజా, ఏ.ఆర్ రెహమాన్ లు ఒక పాటను కంపోజ్ చేసారు. ఈ పాటకు వేదికపై రజనికాంత్, కమల్ హాసన్, చిరంజీవి, మోహన్ లాల్, మమ్ముట్టి, నాగార్జున తదితరులు వేదికపైన నర్తించనున్నారు. ఇది ఈ వేడుకకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు. అంతే కాక 50 మంది సీనియర్ నటుల ముఖచిత్రాలతో తపాలా బిళ్ళలను విడుదలచెయ్యనున్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు