వక్కంతం వంశీ దర్శకత్వంలో నటించనున్న ఎన్.టీ.ఆర్

వక్కంతం వంశీ దర్శకత్వంలో నటించనున్న ఎన్.టీ.ఆర్

Published on Jul 4, 2013 10:08 AM IST

NTR
‘బాద్ షా’ చిత్రం తరువాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చాలా వేగంగా సినిమాలను అంగీకరిస్తున్నాడు. ప్రస్తుతం ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాలో నటిస్తునాడన్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడు. శృతి హాసన్ హీరోయిన్. ఈ సినిమా తరువాత మనోడు బెల్లంకొండ నిర్మిస్తున్న ‘రభస’లో నటిస్తాడు. అయితే ఇప్పుడు తాజాగా మరో సినిమాను అంగీకరించాడు. అల్లు అర్జున్ నటిస్తున్న ‘రేసు గుర్రం’ సినిమాకు కధ అందించిన వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. ఇప్పటికే కధా చర్చలు పుర్తవగా అధికారిక ప్రకటన వెల్లడించాల్సివుంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు