వాళ్ళ శక్తిని తక్కువగా అంచనా వేయకూడదు – నరేంద్ర మోడీ

వాళ్ళ శక్తిని తక్కువగా అంచనా వేయకూడదు – నరేంద్ర మోడీ

Published on Apr 8, 2013 10:00 AM IST

ఈ మధ్య కాలంలో మనదేశంలో గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే చాలు తల్లి తండ్రులే నిర్దాక్షన్యంగా చంపేస్తున్నారు. ఇది చాలా దారుణం అని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తన భాదని వ్యక్తం చేసారు. ఫిక్కీ మహిళా విభాగం వార్షికోత్సవానికి హాజరైన నరేంద్ర మోడీ తన మనసులోని మాటల్ని అక్కడి వారితో పంచుకున్నారు. ఆయన సభను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ మామూలుగా తల్లి తండ్రులు కూతుళ్ళ కంటే కొడుకులను బాగా చూసుకుంటే వాళ్ళు తమను వృద్దాప్య దశలో చూసుకుంటారు అనే అపోహలో ఉంటారు కానీ కొడుకుల కంటే కూతుల్లే ఆ వయస్సులో మీకు ఆసరాగా నిలుస్తారు. మనదేశంలో మహిళలకి, అమ్మ అనే స్థానాన్ని చాలా ఉన్నతంగా చూసుకుంటారు. ప్రస్తుతం మహిళలు ఎందులోనూ తక్కువ కాదు, అన్ని రంగాల్లోనూ మగ వారితో పోటీగా దూసుకుపోతున్నారు. మహిళా శక్తిని తక్కువగా అంచనా వేయొద్దని’ అన్నారు.

తాజా వార్తలు