లేడీ డైరెక్టర్ అయినప్పటికీ మొదటి సినిమాతోనే తన టాలెంట్ ని నిరూపించుకున్న డైరెక్టర్ నందిని రెడ్డి. ‘అలా మొదలైంది’ అంటూ తన ప్రస్థానం మొదలు పెట్టిన రెండవ సినిమాగా ‘జబర్ దస్త్’ సినిమా చేసింది. ఆ సినిమా ఆశించినట విజయాన్ని ఇవ్వకపోవడంతో ప్రస్తుతం మూడో సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉంది. బాగా డేరింగ్ గా ఉండే ఈమెని చావంటే భయపడతారా అని అడిగితే ‘ చావంటే అస్సలు భయం లేదు. నేను ఇప్పటికే రెండు సార్లు చావుని ముఖలో ముఖం పెట్టి చూసొచ్చానని’ సమాధానం ఇచ్చింది.
అలాగే మాట్లాడుతూ ‘ నందిని అందరికీ నవ్వులు పంచి వెళ్ళిపోయిందని నన్ను గుర్తు పెట్టుకోవాలి. అలాగే మరో జన్మంటూ ఉంటే డాల్ఫిన్ గా పుట్టాలి. నాకు మామూలుగా నీళ్ళంటే ఇష్టం అలాగే ఆ నీళ్ళల్లో ఉండే డాల్ఫిన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే నేను డాల్ఫిన్స్ లాగా పుట్టాలనుకుంటున్నానని’ తన మనసులోని మాటని చెప్పింది.