నాని నితిన్ సినిమాల హక్కులను సొంతం చేసుకున్న మల్టీ డైమెన్షన్స్ సంస్థ

నాని నితిన్ సినిమాల హక్కులను సొంతం చేసుకున్న మల్టీ డైమెన్షన్స్ సంస్థ

Published on Aug 13, 2013 9:00 AM IST

Multi
వెంకటేష్ నటించిన ‘బాడి గార్డ్’, లారెన్స్ తీసిన ‘కాంచన ‘ సినిమాలతో టాలీవుడ్ కు పరిచయమైన డిస్ట్రిబ్యూషన్ సంస్థ మల్టీ డైమెన్షన్స్ ఎంటర్టైన్మెంట్స్. కాస్త విరామం తరువాత ఈ సంస్థ పలు చిన్న సినిమాల పంపిణి హక్కులను సొంతం చేసుకుని తమ ద్వారానే మన రాష్ట్రంలో విడుదల చెయ్యనున్నాయి.

వీటిలో నితిన్ నటిస్తున్న ‘కొరియర్ బాయ్ కళ్యాన్’, నాని ద్విపాత్రాభినయం చేస్తున్న ‘జండాపై కపిరాజు’ సినిమాలు ముఖ్యమైనవి.అంతేకాక ‘సెకండ్ హ్యాండ్’, ప్రిన్స్ నటిస్తున్న మరో రెండు సినిమాలు, సురేష్ కృష్ణ యొక్క ద్విభాషా చిత్రం కూడా వరుసలోవున్నాయి.

తాజా వార్తలు