రెండు వారాల్లో మొదలుకానున్న మూడు తరాల సినిమా??

రెండు వారాల్లో మొదలుకానున్న మూడు తరాల సినిమా??

Published on May 23, 2013 8:30 AM IST

Nag_Family_Movie
అక్కినేని వంశంలో మూడు తరాల నటులు కలిసి నటించబోతున్న ‘మనం’ సినిమా ప్రారంభతేది ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. ఈ సినిమా లాంచనంగా జూన్ 7న మొదలుకానుంది. ‘ఇష్క్’ సినిమాతో ఫ్లాపుల ఊబిలో కూరుకుపోయిన నితిన్ కు హిట్ రుచి చూపించిన విక్రమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకుడు.నాగార్జున సరసన శ్రియ, నాగ చైతన్య సరసన సమంత కనిపించనున్నారు. నాగార్జున ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు