నేనొక నటి అని నాకు అప్పుడే తెలిసిందంటున్న కార్తీక

నేనొక నటి అని నాకు అప్పుడే తెలిసిందంటున్న కార్తీక

Published on Jun 30, 2013 1:15 PM IST

Karthika
టాప్ హీరోయిన్ కూతురుగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ సరైన హిట్ అందుకోవడంలో సక్సెస్ అందుకోలేకపోయిన పొడుగు కాళ్ళ సుందరి కార్తీక నటిగా తన టాలెంట్ నిరూపించుకునే సినిమా దొరికిందని చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం కార్తీక తమిళ్ లో బాగా ఫేమస్ అయిన భారతీ రాజా దర్శకత్వంలో ‘అన్నా కొడై’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా గురించి మాట్లాడుతూ ‘ ఈ సినిమాలో నేనొక డీ గ్లామర్ రోల్ చేస్తున్నాను. ఆ పాత్ర చేస్తున్నప్పుడే నాకు అర్థమైంది నేనొక నటి అని, ఇలాంటి పాత్రలు దొరికినప్పుడే నాలోని వైవిధ్యాన్ని చూపగలను. అలా అని గ్లామర్ అవసరం లేదని కాదు గ్లామర్ కూడా ముఖ్యమే. కానీ ఈ సినిమాతో కార్తీక మంచి నటి కూడా అని అందరికీ తెలుస్తుందని’ కార్తీక చెప్పుకొచ్చింది. హిట్ కోసం ఎదురు చూస్తున్న కార్తీకకి వాస్తవానికి దగ్గరగా ఉండే నేపధ్యంతో తెరకెక్కిన ఈ సినిమా అన్నా విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.

తాజా వార్తలు