పెద్ద సినిమాలంటే హీరోల డేట్లనుండి, నిర్మాత నోట్ల వరకూ ప్రతీ చిన్న విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రస్తుతం హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ‘రామయ్యా వస్తావయ్యా’ షూటింగ్ జరుపుతున్న బృందన్నంతా ఈ దర్శకుడు పొగడ్తలలో ముంచెత్తాడు. భాగ్యనంగరంలో భగ భగ మండే ఎండలను తట్టుకుంటూ యాక్షన్ సీన్లను తీస్తున్న బృందాన్ని దర్శకుడు కొనియాడాడు.
’44 డిగ్రీల ఎండలో యాక్షన్ సీన్లను తీస్తున్నాం. మా బృందానికి, మా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కష్టానికి హ్యాట్స్ ఆఫ్’అని ట్వీట్ చేసాడు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. సమంత హీరొయిన్. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు