అదిరిపోయే రీతిలో దేవీ బాలయ్యల కాంబినేషన్

అదిరిపోయే రీతిలో దేవీ బాలయ్యల కాంబినేషన్

Published on Jul 31, 2013 4:38 AM IST

Balakrishna_New_Film_Launch
రికార్డులను బద్దలు కొట్టడానికి, బాలయ్య బాబు తొడ కొడితే చాలు.. ఆయన చెప్పే పంచ్ డైలాగులు బాలకృష్ణ అభిమానుల ఇంచ్ టు ఇంచ్ పులకరరించిపోవడానికి. అలంటి బాలకృష్ణ సినిమాలో పాటలు సైతం వీటికి ధీటుగా నిలుస్తాయంటే?? ఇంతకన్నా అభిమానులకు పండుగ వార్త ఏముంటుంది?? ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘జయసింహా’ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ యువరత్న కెరీర్ లోనే అదిరిపోయే ట్యూన్స్ ను అందించేపనిలో వున్నాడు. ఇప్పటికే కంపోజ్ చేసిన ఒక ఫ్యామిలీ సాంగ్ బాలయ్యతో పాటూ బృందమంతటికీ నచ్చిందట. సో, బాలయ్య – బోయపాటి కలయికలో సంగీతంకూడా సినిమాకు తగ్గ రీతిలో సమపాళ్ళలో సమకూరుస్తున్నాడన్నమాట

తాజా వార్తలు