యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ‘అలిమేలుమంగ వేంకటరమణ’. తనకు నటుడిగా లైఫ్ ఇచ్చి ఇండస్ట్రీలో తనను నిలబెట్టినా దర్శకుడు తేజతో గోపీచంద్ హీరోగా చేస్తోన్న మొదటి సినిమా ఇది. కాగా తేజ, గోపీచంద్ కోసం ఓ యాక్షన్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ ను కూడా ఫైనల్ చేశారట. పూర్తిగా పాత్ర బలంతో నడిచే కథ కావడంతో గోపీచంద్ కి కథ బాగా సూట్ అవుతుందని తెలుస్తోంది.
అన్నీ కుదిరితే డిసెంబర్ నుండి ఈ సినిమా పట్టాలైక్కే అవకాశముంది. మొత్తానికి మరో పవర్ ఫుల్ రోల్ లో యాక్షన్ హీరో నటించబోతున్నాడు. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన ‘జయం, నిజం’ సినిమాలతో ప్రతినాయకుడిగా నిలదొక్కుకున్న గోపీచంద్ ఈ సారి హీరోగా తేజ దర్శకత్వంలో సూపర్ హిట్ అందుకుంటాడేమో చూడాలి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ అలిమేలు మంగ పాత్రలో టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవిను ఫైనల్ చేసే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది.
నిజానికి ఇప్పటికే స్టార్ హీరోయిన్ల పేర్లని కూడా తేజ పరిశీలించారు. వారిలో ముఖ్యంగా కాజల్, అనుష్కలో ఒకర్ని హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు. కానీ కాజల్, అనుష్క బల్క్ డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే సాయి పల్లవిని ఫిక్స్ చేయనున్నారు. గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో స్పోర్ట్స్ బేస్డ్ సినిమా ‘సీటీమార్’ చేస్తోన్నాడు.