తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిగా ఆడపాదడపా ఛాన్స్ లు అందుకంటూ తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది ఈషా రెబ్బా. సోషల్ మీడియాలో ఈ మధ్య ఈషా రెబ్బా హాట్ స్టిల్స్ బాగా వదులుతుంది. ఆ స్టిల్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి కూడా. అయితే ఈ తెలుగు బ్యూటీ ఓ లేటెస్ట్ అప్ డేట్ తో కూడా వార్తల్లో నిలిచింది. హిందీలో తెరకెక్కిన లస్ట్‌స్టోరీస్ వెబ్‌సిరీస్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే.
ఈ వెబ్‌సిరీస్ లో అత్యంత బోల్డ్‌గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది కియారా ఆడ్వాణీ. కాగా ఇప్పుడు ఆ బోల్డ్ పాత్రలో ఈషా రెబ్బా నటిస్తోందని, ప్రస్తుతం ఆ పాత్రకు ఆమె డబ్బింగ్ చెబుతుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెలుగులో చేస్తోన్న పనిమనిషి ఎపిసోడ్ లో ఇషా నటిస్తోందట.