బాలయ్య బాబు – బి.గోపాల్ కలయికలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ప్రెజెంట్ ఫామ్ లో ఉన్న టాప్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి ఫుల్ స్క్రిప్ట్ ను అందిస్తున్నారు. అయితే సాయి మాధవ్ స్క్రిప్ట్ ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఫుల్ యాక్షన్ తో కూడుకున్న ఎమోషనల్ ఎంటర్ టైనర్ ను సాయి మాధవ్ రాసాడట. మరి స్క్రిప్ట్ బాలయ్యకు నచ్చితే నవంబర్ నుండి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
ఇక బాలయ్య బాబు – బి.గోపాల్ లది సూపర్ హిట్ కాంబినేషన్. బాలయ్య కెరీర్లోనే సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచిన ‘సమరసింహారెడ్డి, నరసింహనాయుడు’ సినిమాలు బి గోపాల్ డైరెక్ట్ చేసినవే. ఆయితే అది గతం.. ప్రస్తుతం గోపాల్ ఫామ్ లో లేడు. కానీ బాలయ్య మాత్రం తన తరువాత సినిమాని బి గోపాలే డైరెక్ట్ చెయ్యాలని పట్టు బడుతున్నాడట.
మరి చూడాలి ఈ సూపర్ హిట్ కాంబో మళ్లీ సక్సెస్ అవుతుందో లేదో. ఇక బాలయ్య మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో బాలయ్య నటిస్తున్నాడు. బాలయ్యకు పెద్ద హిట్ ఇవ్వాలనే కసితో బోయపాటి ఈ సినిమా చేస్తున్నాడు.