గుడిలో లేడీ సూపర్ స్టార్ పెళ్లి ?

సౌత్ ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరోయిన్ కు లేనివిధంగా లేడీ సూపర్ స్టార్ నయనతార వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ తో నయనతార పీకల్లోతు ప్రేమలో ఉంది. నిజానికి వీరి ప్రేమాయణం చాలా ఏళ్లుగా నడుస్తూనే ఉంది. అయితే తాజాగా వీరి వ్యక్తిగత బంధానికి శుభం కార్డ్ పలుకుతూ త్వరలోనే ఈ జోడీ వివాహం చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

కేరళలోని ఓ గుడిలో పెళ్లి చేసుకుని దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారని సమాచారం. నిజానికి ఎప్పటినుండో నయనతార పెళ్లి రూమర్లు అనేక సార్లు హడావుడి చేసాయి, కానీ నయనతార మాత్రం ఎప్పటిలాగే తన ప్రేమ మైకంలోనే ఉండిపోయింది. అయితే కరోనా వల్ల దొరికిన గ్యాప్ లో వీరిద్దరూ పెళ్లితో ఒక్కటవుతున్నారట.

కాగా పెళ్లికి నయనతార తొందరపడకపోయినా విఘ్నేష్ శివన్ ఇంట్లో మాత్రం తొందరపెడుతున్నారని.. అందుకే నయనతార కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే నయనతార స్పందించే వరకు ఆగాల్సిందే.

Exit mobile version