బిగ్ అప్డేట్ : సరికొత్త రిలీజ్ డేట్‌తో రానున్న ‘కింగ్డమ్’ ప్రోమో.. ఎప్పుడంటే..?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘కింగ్డమ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాలో విజయ్ దేవరకొండ సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఇక ఈ సినిమాను ఇప్పటికే పలు సార్లు వాయిదా వేయడంతో ఈ చిత్ర రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

అయితే, తాజాగా ఈ అనుమానాలన్నింటికీ చెక్ పెడుతూ ‘కింగ్డమ్’ చిత్ర కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రెస్టీజియస్ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ ప్రోమోను నేడు సాయంత్రం 7.03 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో ఈ రిలీజ్ డేట్ ఎప్పుడనేది ఆసక్తికరంగా మారింది.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తుండగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version