‘గుజారిష్’ సినిమాతో సినిమాలకు దూరమైన ఇండియన్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ ఆరాధ్య అనే పాపకి జన్మనిచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా కెమెరాకి దూరంగా ఉన్న ఐశ్వర్య రాయ్ ఇటీవలే ఒక జ్యువెలరీ యాడ్లో కనిపించారు. అలా కనిపించిన ఐష్ పై కొద్ది రోజులుగా సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్ మణిరత్నం తీయబోయే సినిమాతో ఐశ్వర్య రాయ్ రీ ఎంట్రీ ఇవ్వనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తపై మణిరత్నం గారి భార్య సుహాసిని మణిరత్నం స్పందించారు. ఆమె మాట్లాడుతూ ‘ ఐష్ – మణిరత్నం సినిమా పై వస్తున్న వార్తలను నమ్మకండి. ఎవరో ఆకతాయిలు కావాలనే ఆ వార్తని సృష్టించారు. ప్రస్తుతం మణిరత్నం తీస్తున్న ‘కడల్’ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. చిత్రీకరణ పూర్తవ్వగానే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీ అవుతారు. ఈ చిత్రం పూర్తి చేసి, మరో కథ రాసుకుని సినిమా మొదలు పెట్టడానికి కనీసం ఎనిమిది నెలల సమయం పడుతుంది, కావున అప్పటి వరకూ మణిరత్నం సినిమాల గురించి వచ్చే వార్తలని నమ్మకండని’ ఆమె అన్నారు. ప్రస్తుతం మణిరత్నం తీస్తున్న ‘కడల్’ సినిమా ‘కడలి’ పేరుతో తెలుగులో విడుదల కానుంది.
మరో ఎనిమిది నెలల వరకు సినిమా లేదంటున్న టాప్ డైరెక్టర్
మరో ఎనిమిది నెలల వరకు సినిమా లేదంటున్న టాప్ డైరెక్టర్
Published on Oct 5, 2012 12:00 PM IST
సంబంధిత సమాచారం
- ఇంటర్వ్యూ : హీరో శివకార్తికేయన్ – ‘మదరాసి’ ఆడియన్స్కు డిఫరెంట్ ఎక్స్పీరియెన్స్ ఇస్తుంది..!
- గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్ ‘టన్నెల్’ ట్రైలర్ రిలీజ్
- టాక్.. ‘పెద్ది’ కూడా గ్లోబల్ లెవెల్ ప్లానింగ్?
- శీలావతి కోసం పుష్పరాజ్… సౌండింగ్ అదిరింది..!
- నైజాంలో ‘రాజా సాబ్’ డీల్ పూర్తి.. రిలీజ్ చేసేది వారేనట!?
- లేటెస్ట్.. ‘కూలీ’ ఓటీటీ డేట్ వచ్చేసింది!
- 300 కోట్ల సినిమా ఉన్నా ‘మదరాసి’ కి చప్పుడే లేదే!
- IPL 2026: ధోని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఐపీఎల్ అభిమానులకు బ్యాడ్ న్యూస్
- పైడ్ ప్రీమియర్స్ తో ‘లిటిల్ హార్ట్స్’.. మేకర్స్ కాన్ఫిడెన్స్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ఓజి’లో తన పాత్రపై కుండబద్ధలు కొట్టిన బ్యూటీ..!
- ఆంధ్ర కింగ్ తాలూకా.. బీట్ రెడీ సింగర్ కూడా రెడీ..!
- ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేసిన ‘కన్నప్ప’
- ఓటీటీలో ‘కన్నప్ప’ ట్విస్ట్!
- అల్లరి నరేష్ కొత్త సినిమా టీజర్ కి డేట్ ఫిక్స్!
- ‘ఓజి’ మేకర్స్ ఈ విషయంలో లైట్ తీసుకున్నారా..!
- వీడియో : కిష్కింధాపురి ట్రైలర్ (బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్)
- వీడియో : ఘాటీ రిలీజ్ గ్లింప్స్ (అనుష్క శెట్టి)