మన టాలీవుడ్ కు చెందిన స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు కన్నడ ఇండస్ట్రీకు చెందిన మరో స్టార్ హీరో కిచ్చా సుదీప్ లు నిన్న కలిసిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కలయిక ఒక్కసారిగా ఇండస్ట్రీ వర్గాల్లో మంచి హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ కలయిక మామూలుగానే జరిగిందని ఒక వెర్షన్ వినిపించినా మరో వెర్షన్ ప్రకారం మరిన్ని స్పెక్యులేషన్స్ స్ప్రెడ్ అవుతున్నాయి.
నిజానికి ఈ ఇద్దరి హీరోల మధ్య చాలా పెద్దగా పరిచయం ఉన్నట్టుగా ఇంతకు ముందు దాఖలాలు లేవు. దీనితో ఎలాంటి సంబంధం లేని ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఇలా సడెన్ గా కలుసుకోవడం ఏమిటా అని ఫ్యాన్స్ అంతా డౌట్ పడుతున్నారు. కేవలం ఇది సాధారణ మీటింగేనా లేక ఏమన్నా సినిమా ప్లానింగ్ లో ఉన్నారా అంటూ మరిన్ని గాసిప్స్ కూడా మొదలయ్యిపోయాయి. మొత్తానికి మాత్రం ఈ పవర్ – కిచ్చా ల కలయిక మంచి హాట్ టాపిక్ గా మారింది.