ఎఫ్ 1: ఓటిటిలోకి వచ్చాక చాలా ఫీలవుతున్న నెటిజన్స్!

రీసెంట్ గా హాలీవుడ్ సినిమా నుంచి రిలీజ్ కి వచ్చి సెన్సేషనల్ హిట్ అయ్యిన చిత్రమే “ఎఫ్ 1”. హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ రేసి స్పోర్ట్స్ డ్రామా చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లోనే వరల్డ్స్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి అదరగొట్టింది. ఇలా చాలా రోజులు తర్వాత రీసెంట్ గానే ఓటిటిలోకి అందుబాటులోకి వచ్చింది.

అయితే అంత పెద్ద హిట్ అయినప్పటికీ ఈ సినిమాని ఓటిటిలో చూసిన తర్వాత నెటిజన్స్ చాలా ఫీలవుతున్నారు. ఓటిటిలో చూసినప్పుడే ఈ సినిమా ఎక్స్ పీరియన్స్ ఇలా ఉంటే థియేటర్స్ లో అదిరిపోయి ఉండేది అని సరైన స్క్రీన్ లో ప్లాన్ చేసుకుని అంటే ఆ ఫీల్ ఇంకోలా ఉండేది అని మంచి సినిమాని థియేటర్స్ లో మిస్ చేసుకున్నామని అనుకుంటున్నారు.

దీనితో ఓటిటిలో కూడా బ్రాడ్ పిట్ చిత్రం సెన్సేషనల్ హిట్ అయ్యిందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ తదితర ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లలో అందుబాటులో ఉంది. ఇప్పటికీ మీకు దగ్గర థియేటర్స్ లో ఉంటే మాత్రం డోంట్ మిస్.

Exit mobile version