నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు సిరీస్‌గా సందీప్ కిషన్ ‘సూపర్ సుబ్బు’

యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ ‘మజాకా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు డైరెక్ట్ చేయగా పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఇది ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా తర్వాత సందీప్ కిషన్ ఓ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు వెబ్ సిరీస్‌గా ‘సూపర్ సుబ్బు’ రానుంది. ఈ వెబ్ సిరీస్‌ను దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్నాడు. ఇక ‘సూపర్ సుబ్బు’ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్‌ను నెట్‌ఫ్లిక్స్ తాజాగా రిలీజ్ చేసింది. ఈ సూపర్ సుబ్బు వెబ్ సిరీస్ ఆద్యంతం ఆకట్టుకునే ఎంటర్‌టైనింగ్ కథతో రాబోతున్నట్లు ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది.

ఇందులో మిథిలా పాల్కర్ హీరోయిన్‌గా నటిస్తుండగా మురళీ శర్మ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్‌ను త్వరలో ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version