నవంబర్ 8న విడుదలకానున్న నేనేం చిన్నపిల్లనా??

నవంబర్ 8న విడుదలకానున్న నేనేం చిన్నపిల్లనా??

Published on Oct 28, 2013 8:00 PM IST

Nenem-Chinna-Pillana
‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రాహుల్ రవీంద్రన్ తన తదుపరి సినిమా ‘నేనేం చిన్నపిల్లనా’ తో వచ్చేనెలలో మనముందుకు రానున్నాడు

ఈ సినిమా ముందుగా సెప్టెంబర్ 26న విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ ‘అత్తారింటికి దారేది’ సినిమా ముందుగా విడుదలకావడంతో వాయిదాపడ్డ ఇప్పుడు ఈ సినిమా నవంబర్ 8న విడుదలకు సిద్ధమయ్యింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి. రామానాయుడు నిర్మిస్తున్నాడు. ఈ సినిమా విడుదలవుతున్న వారమే ఆ బ్యానర్ 50వ వసంతంలోకి అడుగుపెట్టనుంది.

ఈ సినిమాలో తన్వి వ్యాస్ మరియు సంజనా హీరోయిన్స్. పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకుడు. ఎం.ఎం శ్రీలేఖ సంగీత దర్శకురాలు

తాజా వార్తలు