తమిళ సినిమా దగ్గర ఉన్నటువంటి స్టార్ దర్శకుల్లో ఏ ఆర్ మురుగదాస్ కూడా ఒకరు. గత కొంత కాలం నుంచి హిట్ కోసం చూస్తున్న తాను ఈ ఏడాదిలో సికందర్ తో భారీ ప్లాప్ ఇచ్చారు. అయితే ఇటీవల ఇండియన్ సినిమా దగ్గర మారిన బాక్సాఫీస్ లెక్కలు 1000 కోట్ల సినిమాలపై తాను చేసిన స్టేట్మెంట్ వైరల్ గా మారింది.
ఇతర భాషల దర్శకులు కేవలం ఎంటర్టైన్ మాత్రమే చేస్తున్నారని కానీ తమ తమిళ దర్శకులు మాత్రం జనాన్ని ఎడ్యుకేట్ చేస్తున్నామని తమ సినిమాలతో ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో ప్రేక్షకులకు నేర్పిస్తున్నామని తమిళ్ సినిమా దర్శకులని మరే ఇతర దర్శకులతో పోల్చొద్దు అంటూ కామెంట్ చేయడం సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు తీసుకొస్తుంది.
ఇండియన్ సినిమా దగ్గర ఎక్కువ 1000 కోట్ల సినిమాలు తెలుగు నుంచే ఉండడంతో తెలుగు ఆడియెన్స్ ఈ స్టేట్మెంట్ తో ఏకీభవించడం లేదు. తెలుగు సినిమా నుంచి కూడా ఎన్నో మంచి సినిమాలు ఉన్నాయని మురుగదాస్ విషయంలో వారంతా ఈ రకంగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే మురుగదాస్ తన ‘మదరాశి’ సినిమా రిలీజ్ ముందు ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తుండడం విశేషం. ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో ప్లాన్ చేసుకున్నారు.