ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న నాగ చైతన్య గౌరవం

ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న నాగ చైతన్య గౌరవం

Published on Feb 3, 2012 2:13 PM IST


యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య రాధామోహన్ డైరెక్షన్లో చేయబోయే ద్విభాషా చిత్రం ‘గౌరవం’ ఫిబ్రవరి 25న ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో తమిళ స్టార్ శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి హీరొయిన్ గా నటించనుంది. గౌరవం చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున స్వయంగా నిర్మించనున్నారు. చిత్ర రెగ్యులర్ షూటింగ్ మార్చి 5 నుండి జరగనుంది. సిటీ నుండి పల్లెటూరికి వెళ్ళే యువకుడిగా నాగ చైతన్య నటిస్తుండగా ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనుంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

తాజా వార్తలు