నయనతార ఈ మధ్య చాలా బిజీతారగా మారిపోయింది. రాజా రాణి, ఆరంభం వంటి విజయాలతో ఆమెను చాలా ఆఫర్లు దరికి చేరాయి. కానీ తొందరపడకుండా కధల ఎంపికలో జాగ్రత్త వహిస్తుంది
ప్రస్తుతం బెంగుళూరులో జయం రాజా దర్శకత్వంలో షూటింగ్ లో బిజీగా వుంది. జయం రవి హీరో. నయనతార, రవి కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా. గణేష్ వెంకటరామన్ ముఖ్యపాత్రధారి. ఈ సినిమానే కాక నయన్ శింభుతో జతగా పాండిరాజ్ దర్శకత్వంలో నటిస్తుంది
ఫిబ్రవరిలో ఈ భామ నటించిన తెలుగు, తమిళ సినిమాలు విడుదలకానున్నాయి. శేఖర్ కమ్ముల ‘అనామిక’కూడా త్వరలో విడుదలకానుంది. అంతేకాక ఉధయనిధి స్టాలిన్ తో నటించిన సినిమా ఫిబ్రవరి 14న విడుదలకానుంది