నయనతార ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోని తమిళ సినిమా పరిశ్రమలలో . ఈ మధ్య విడుదలైన ఆమె నటించిన సినిమాలు ‘ఆరంభం’, ‘రాజా రాణి’ మంచి విజయన్ని సాదించాయి. దీనితో ఆమెపై విమర్శులు చేసిన వారికి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టు అయ్యింది. ప్రస్తుతం ఆమె ‘బిలింగల్’, ‘అనామిక’ సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 2014లో విడుదలయ్యే అవకాశం వుంది. తాజా సమాచారం ప్రకారం ఆమె తన తరువాతి తమిళ సినిమా షూటింగ్ చెన్నైలో పాల్గొంటుంది. ఈ టైటిల్ పెట్టని సినిమాకి జయం రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. నయనతార, జయం రవితో కలిసి ఈ సినిమాలో నటిస్తోంది. జయం రవి ప్రస్తుతం ‘జెండా పై కపిరాజు’ సినిమా తమిళ వర్షన్ లో నటిస్తున్నాడు.
ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. నయనతార మొదటి సారిగా జయం రవితో కలిసి నటిస్తోంది. కోలీవుడ్ వర్గాలు మొత్తం ఈ సినిమా ఎలా వుంటుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే నయనతార బి గోపాల్ రొమాంటిక్, యాక్షన్ డ్రామా గా తెలకేక్కుతున్న ‘బిలింగల్’ సినిమాలో గోపీచంద్ తో కలిసి నటిస్తోంది.