చిరు కోసం సెంటిమెంట్‌ను పక్కనబెట్టిన నయనతార.. వర్కవుట్ అయ్యిందిగా!

చిరు కోసం సెంటిమెంట్‌ను పక్కనబెట్టిన నయనతార.. వర్కవుట్ అయ్యిందిగా!

Published on May 17, 2025 8:03 PM IST

ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ కాంబోగా పేరుతెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కలయికలో రాబోయే సినిమాపై అప్పుడే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఓ వీడియో రూపంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.

అయితే, నయనతార గతకొన్నేళ్లుగా ఫాలో అవుతున్న సెంటిమెంట్‌ను చిరు కోసం పక్కనబెట్టింది. ఆమె తన సినిమాల ప్రమోషన్స్‌కు చాలా వరకు దూరంగా ఉంటుంది. కానీ, చిరు కోసం ఏకంగా డే 1 నుంచే ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది. దీంతో నయన్ అభిమానులు కూడా అవాక్కవుతున్నారు. ఇక ఈ క్రెడిట్ అంతా దర్శకుడు అనిల్ రావిపూడికే చెందుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. గతంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కోసం కూడా అనిల్ రావిపూడి చేసిన ప్రమోషన్స్ వేరే లెవెల్‌లో ఉండటంతో ఆ సినిమా జనాల్లోకి బాగా వెళ్లింది.

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం కూడా అనిల్ అదే స్ట్రాటెజీ ఫాలో అవుతుండటం.. నయనతార లాంటి స్టార్ హీరోయిన్ కూడా దీనికి ఓకే చెప్పడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో అప్పుడే సాలిడ్ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు అంటున్నారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు