గ్లామర్ గాల్ నయనతార “కృష్ణం వందే జగద్గురుం” చిత్రం కోసం 1.25 కోట్ల భారీ మొత్తాన్ని పారితోషకంగా అందుకున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో నయనతార రానా సరసన కనపడనుంది. ఈ చిత్రానికి నయనతార మొదటిసారిగా తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ఆమెకి ఉన్న అభిమానుల రిత్యా నిర్మాతలు ఆమెకి ఇంత భారీ మొత్తాన్ని ఇచ్చినట్టు తెలుస్తుంది. గ్లామర్ విషయాన్నీ పక్కన పెడితే ఆమె చాలా మంచి నటి అన్న విషయం అందరికి తెలిసిందే. ప్రభుదేవాతో విడిపోయాక నయనతార రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు ఈ ఇన్నింగ్స్ లో ఆమె చాలా బిజీగా కనిపిస్తున్నారు. “కృష్ణం వందే జగద్గురుం” చిత్రం తరువాత ఆమె దశరథ్ దర్శకత్వంలో నాగార్జున సరసన “లవ్ స్టొరీ”లో కనిపించనున్నారు.