నాగార్జునతో రొమాన్స్ చేయనున్న నయనతార

నాగార్జునతో రొమాన్స్ చేయనున్న నయనతార

Published on Jan 24, 2012 4:35 PM IST


నయనతార సినిమాలకు వీడ్కోలు చెప్పాలని భావించినప్పటికీ చూడబోతే ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు కనిపిస్తోంది. కింగ్ నాగార్జున నటించబోయే తరువాత చిత్రంలో నయనతార హీరొయిన్ గా చేయనున్నట్లు సమాచారం. దశరద్ డైరెక్ట్ చేస్తున్న చిత్రాన్ని కామాక్షి మూవీస్ బ్యానర్ పై శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. 2012 ద్వితీయార్ధంలో ఈ చిత్రం మొదలవుతుంది.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర స్క్రిప్ట్ నాగార్జునకి బాగా నచ్చి వెంటనే అంగీకరించారని సమాచారం. గతంలో నాగార్జున దశరద్ కలిసి 2002 లో ‘సంతోషం’ సినిమా తీయగా ఆ చిత్రం మంచి విజయం సాధించింది. పది సంవత్సరాల తరువాత వస్తున్న వీరి కాంబినేషన్ పై అంచనాలు నెలకొన్నాయి. ఇదే కాక నాగార్జున ‘షిర్డీ సాయి బాబా’ చిత్రంలో కూడా నటించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు