నయనతార ప్రస్తుతం రానా తో “కృష్ణం వందే జగద్గురు” చిత్రీకరణలో పాల్గొంటుంది. రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్ర చిత్రీకరణలో నయనతార ఈరోజు నుండి పాల్గొంటుంది. నయనతార చాలా రోజుల తరువాత ఈ చిత్రం చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రానా బి.టెక్ బాబుగా కనిపించబోతున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జాగర్లమూడి సాయి బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రానా కొత్తగా కనిపించబోతున్నారని సమాచారం.