బాలీవుడ్లో కూడా నటించబోతున్న నయనతార


ఇకపై సినిమాల్లో నటించను అని ప్రకటించి మళ్లీ మేకప్ రాసుకోబోతున్న నయనతార బాలీవుడ్లో నటించనుంది అనే వార్త ఫిలిం నగర్లో షికారు చేస్తుంది. బాలీవుడ్ నుండి పలు సినిమాల్లో నటించమని ఆఫర్స్ రావడంతో అంగీకరించినట్లుగా తెలుస్తోంది. దీని గురించి త్వరలో ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. శ్రీ రామరాజ్యం తరువాత రెండవ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆమెకు తెలుగు మరియు తమిళ సినిమాల నుండి చాలా ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయి. నాగార్జున సరసన ఒక తెలుగు సినిమా అంగీకరించినట్లుగా తెలుస్తోంది. మిగతా వివరాలు త్వరలో ప్రకటిస్తారు.

Exit mobile version