ప్రభుదేవా విషయంలో మౌనం వీడిన నయనతార


ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవాతో ఉన్న నయనతారకు సంభంధం గురించి చివరకు ఆమె మౌనం వీడారు. ప్రభుదేవాతో తనకు ఉన్న బంధం ఇంక తెగిపోయిందని ఆమె అన్నట్లు చెన్నై పత్రికల ప్రచురించాయి. చెన్నై పత్రికల సమాచారం ప్రకారం ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ మా మధ్య సంభంధం ముగిసింది. అందుకోసం నేను ఎన్నో త్యాగాలు చేశాను, ఎన్నో ఆఫర్లు మరియు ప్రాజెక్టులు పోగుట్టుకున్నాను. మా మధ్య సంభందానికి ఇంక ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాను. ఇది నా విషయం నా స్వంత విషయం, అందుకే పెద్దది చేయదలుచుకోలేదు అంటూ ముగించింది. ప్రస్తుతం నయనతార తన కెరీర్ పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం తెలుగు,తమిళ భాషల్లో నటించడానికి అంగీకరించిన ఆమె చేతిలో నలుగు ప్రాజెక్టుల వరకు ఉన్నాయి,

Exit mobile version