‘నాయక్’ సంక్రాంతి రేస్ నుండి తప్పుకోనున్నాడా?


ఫిలిం నగర్ వర్గాల తాజా సమాచారం ప్రకారం వివి వినాయక డైరెక్షన్లో చరణ్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్న ‘నాయక్’ సినిమా సంక్రాంతి రేస్ నుండి తప్పుకున్నట్లు సమాచారం. సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ఇటీవల నిర్మాతలు ప్రకటించినప్పటికీ నాయక్ సంక్రాంతికి విడుదల కాదని చెబుతున్నారు. కారణాలు ఏమిటనేది తెలియనప్పటికీ దీని గురించి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. చరణ్ సరసన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, అమలా పాల్ జంటగా నటిస్తున్నారు. శ్రీను వైట్ల డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘బాద్షా’ కూడా మొదట సంక్రాంతికే అనుకున్నప్పటికీ అది కూడా సంక్రాంతికి రావడం లేదు. ఇవి కాకుండా మెహర్ రమేష్ డైరెక్షన్లో వెంకటేష్ హీరోగా వస్తున్న ‘షాడో’ మరియు దశరద్ డైరెక్షన్లో నాగార్జున, నయనతార జంటగా నటిస్తున్న ‘లవ్ స్టొరీ’ చిత్రాలు సంక్రాంతి సంక్రాంతి రేసులో ఉన్నాయి.

Exit mobile version