విడుదలకు ముందే వైజాగ్లో రికార్డు సృష్టించిన నాయక్

Nayak
రామ్ చరణ్ నాయక్ విడుదలకి ముందే రికార్డులు సృష్టిస్తుంది. ఈ సినిమా వైజాగ్లో 104 ధియేటర్లలో పైగా విడుదలవుతూ భారీ రికార్డు కొట్టింది. గత సంవత్సరం సంక్రాంతికి విడుదలైన బిజినెస్ మేన్ ఇదే ఏరియాలో 84 ధియేటర్ లలో విడుదలైంది. అప్పట్లోనే ఈ రికార్డు చెరిపేయడం చాలా కష్టమనుకున్నారు అందరూ. కానీ ఒక సంవత్సరంలో నాయక్ ఈ రికార్డులు తుడిచేసి కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ రికార్డు ఎవరు బద్దలు కొడతారో చూడాలి మరి. ప్రపంచవ్యాప్తంగా 1210 ధియేటర్లలో విడుదలవుతున్న ఈ సినిమా మొదటి రోజు రికార్డు కలెక్షన్స్ రావడం ఖాయమే అనిపిస్తుంది. వినాయక డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కాజల్, అగర్వాల్, అమలా పాల్ నటించారు.

Exit mobile version