కలకత్తాలో నాయక్ యాక్షన్ సీన్స్

కలకత్తాలో నాయక్ యాక్షన్ సీన్స్

Published on Oct 15, 2012 8:22 AM IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్న చిత్రం ‘నాయక్’. వివి వినాయక్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం కలకత్తాలో జరుపుకుంటుంది. రామ్ చరణ్, దేవ్ గిల్, కిషోర్ రోయ, రాజీవ్ కనకాల వీరిపై యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. వీటితో పాటుగా కొన్ని కీలక సన్నివేశాలు కూడా ఇక్కడే చిత్రీకరించనున్నారు. రామ్ చరణ్ కి జోడీగా కాజల్ అగర్వాల్, అమల పాల్ జంటగా నటిస్తున్న ఈ సినిమాని యాక్షన్ కి కామెడీ ఎంటర్టైన్మెంట్ జోడించి తెరకెక్కించినట్లు సమాచారం. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తుండగా సంక్రాంతి డిసెంబర్ నెలాఖరు వరకు షూటింగ్ పూర్తి చేసి 2013 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు