బాబుపై పెద్ది ఫోకస్.. ఇలా అయితే ఎలా..?

Peddi

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ భారీ అంచనాల నడుమ వేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ రామ్ చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా 2026 మార్చి 27న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. గ్రామీణ నేపథ్యంలో యాక్షన్‌, ఎమోషన్స్‌తో నిండిన ఈ కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

దర్శకుడు బుచ్చి బాబు సానా ఈ సినిమా కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అంతేగాక ఆయన హీరో రామ్‌చరణ్‌ను కొత్త కోణంలో చూపించాలన్న ఉత్సాహంలో పని పట్ల అంతగా మునిగిపోయి భోజనాన్ని కూడా సరిగా చేయడం లేదని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్‌, బుచ్చి బాబుకు “సినిమా కంటే ముందు నీ ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యంగా ఉంటేనే సినిమా పర్ఫెక్ట్‌గా పూర్తవుతుంది” అని సూచించినట్టు తెలుస్తోంది.

ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతి బాబు, శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version