సమంత ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంది. అవకాశం వచ్చినప్పుడల్లా వ్యక్తిగతం, ఆరోగ్యానికి సంబంధించిన పలు విషయాల్ని ఆమె నెటిజన్లతో పంచుకుంటూ ఉంది. ఐతే, తాజాగా జరిగిన ‘ఓ మీడియా ప్రపంచ సదస్సు 2025’ కార్యక్రమంలో పాల్గొన్న సమంత.. కొన్ని ఆసక్తికర సంగతులు చెప్పుకొచ్చింది. అవేంటో ఆమె మాటల్లోనే విందాం. సమంత మాట్లాడుతూ.. ‘సినిమా ఇండస్ట్రీలో నా జర్నీలో ఏ చిన్న విషయాన్ని మీరు గమనించినా.. అన్ని ప్రజల సమక్షంలో బహిరంగంగానే జరిగాయి. అది నా పర్సనల్ లైఫ్ లో విడిపోవడం అయినా, చివరకు నా అనారోగ్యం అయినా.. ఇలా, నేను ఎదుర్కొన్న అన్ని విషయాల గురించి అందరికీ తెలుసు. ఆ సమయంలో నాపై ఎన్నో విమర్శలు వచ్చాయి’ అని సమంత చెప్పుకొచ్చింది.
సమంత ఇంకా మాట్లాడుతూ.. ‘ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ నేను నా నిజమైన జీవితాన్ని పంచుకోవడానికి భయపడలేదు. నేనేమి పరిపూర్ణురాలిని కాదు.. నేను తప్పులు చేయవచ్చు.. నేనూ తడబడవచ్చు. కానీ ప్రస్తుతం మెరుగ్గా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. లైఫ్ లో ప్రతీది చక్కదిద్దుకున్నట్లుగా, పరిపూర్ణంగా ఉన్నట్లుగా బిల్డప్ ఇవ్వడం నాకు నచ్చదు. గుర్తింపు అనేది ఒక అంతిమ గమ్యస్థానం కాదు.. అది నిరంతరం కొనసాగే ప్రక్రియ మాత్రమే’’ అంటూ సమంత కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.