పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ‘ది రాజా సాబ్’ మూవీని చివరి దశకు చేర్చిన ప్రభాస్, ఆ తర్వాత హను రాఘవపూడితో ఫౌజీ చిత్రాన్ని కూడా ముగించే పనిలో ఉన్నాడు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్ తన నెక్స్ట్ చిత్రాన్ని కల్ట్ చిత్రాల డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో చేయబోతున్నాడు.
స్పిరిట్ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు. అయితే, ఈ చిత్ర షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు సందీప్ రెడ్డి వంగ రెడీ అవుతున్నాడు. కాగా, సందీప్ రెడ్డి వంగ తన సినిమాలను అతి తక్కువ సమయంలో ముగించేస్తుంటాడు.
ఆయన గత చిత్రం ‘యానిమల్’ను కేవలం 100 రోజుల్లోనే ముగించాడు. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. మరి ఇప్పుడు ప్రభాస్‌తో చేయబోయే ‘స్పిరిట్’ సినిమాను కూడా ఆయన వంద రోజుల్లో ముగించేస్తాడా..? సందీప్ రెడ్డి కోసం ప్రభాస్ ఈ ఫీట్ సాధిస్తాడా..? అనేది ఆసక్తికరంగా మారింది.